గురువారం, 19 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 3 మార్చి 2024 (13:20 IST)

ఐపీఎల్ 2024 : సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు సారథిదా పాట్ కమిన్స్‌

pat cummins
ఐపీఎల్ 2024 సీజన్ కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు యాజమాన్యం కెప్టెన్‌ను మార్చివేసింది. మార్క‌‍రమ్‌‍ను తప్పించి ఆ స్థానంలో పాట్ కమిన్స్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించింది. గత యేడాది జరిగిన ఐపీఎల్ వేలంలో కమిన్సన్ ‌సన్ రైజర్స్ యాజమాన్యం ఏకంగా రూ.20.5 కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ చరిత్రలోనే అది రెండో అత్యధిక ధర. అతడికి కెప్టెన్సీ అప్పగించేందుకే అంత ధర పెట్టి అతడిని కొనుగోలు చేసినట్టు తెలిసింది.
 
గత సీజన్‌లో మార్కరమ్ సారథ్యంలోని జట్టు 14 మ్యాచ్‌లలో నాలుగు విజయాలు మాత్రమే సాధించింది. జాబితాలో కింది నుంచి తొలి స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో జట్టులో పలు మార్పులు చేసిన సన్రైజర్స్ జట్టు.. ప్రధాన కోచ్ బ్రయాన్ లారాను తప్పించి అతడి స్థానంలో ఆస్ట్రేలియా జట్టు సహాయక కోచ్ డేనియల్ వెటోరీని నియమించింది.
 
దక్షిణాఫ్రికా టీ20 లీగ్ సన్‌రైజర్స్‌కు చెందిన సన్ రైజర్స్ ఈస్టర్న్ జట్టుకు కెప్టెన్సీగా ఉన్న మార్కరమ్ వరుసగా రెండోసారి కూడా జట్టును విజేతగా నిలిపాడు. అయినప్పటికీ ఐపీఎల్‌లో మాత్రం జట్టుకు కష్టాలు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో ఈసారి అతడిని సారథ్య బాధ్యతల నుంచి తప్పించి కమిన్స్కు ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిసింది. కాగా, జట్టు బౌలింగ్ కోచ్ డేల్ స్టెయిన్ ఈ సీజన్కు దూరంగా ఉంటున్నట్టు సమాచారం. అతడి స్థానంలో న్యూజిలాండ్ పేసర్ జేమ్స్ ఫ్రాంక్లిన్న బౌలంగ్ కోచ్గా నియమించినట్టు సమాచారం.