సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అదనపు బాధ్యతలు.... సమన్వయకర్తలుగా మంత్రులు..

revanth
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం అదనపు బాధ్యతలు అప్పగించింది. త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఆయనను చేవెళ్ల, మహబూబ్ నగర్ లోక్‌సభ నియోజవర్గాల సమన్వయకర్తగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అలాగే, రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు కూడా కూడా సమన్వయకర్తలను నియమించింది. సమన్వయకర్తలుగా మంత్రులు, సీనియర్ నేతలను ఎంపిక చేసింది. 
 
ఇతర లోక్ సభ స్థానాల సమన్వయకర్తలు వీరే...
హైదరాబాద్, సికింద్రాబాద్- డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
మహబూబాబాద్, ఖమ్మం- పొంగులేటి శ్రీనివాసరెడ్డి
నాగర్ కర్నూల్- జూపల్లి కృష్ణారావు
నల్గొండ- ఉత్తమ్ కుమార్ రెడ్డి
మల్కాజిగిరి- తుమ్మల నాగేశ్వరరావు 
భువనగిరి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
వరంగల్- కొండా సురేఖ
ఆదిలాబాద్- ధనసరి సీతక్క
మెదక్- దామోదర రాజనర్సింహ
నిజామాబాద్- జీవన్ రెడ్డి 
కరీంనగర్- పొన్నం ప్రభాకర్, 
పెద్దపల్లి- దుద్దిళ్ళ శ్రీధర్ బాబు
జహీరాబాద్- సుదర్శన్ రెడ్డి