బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 5 జనవరి 2024 (08:15 IST)

భిక్షమెత్తుకుంటున్న ఆటో డ్రైవర్లు.. ఎక్కడ? (వీడియో)

auto drivers
తెలంగాణ రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు భిక్షమెత్తుకుంటున్నారు. తెలంగాణాలో కొత్తగా ఏర్పాటైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నట్టుగా ప్రభుత్వ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ హామీని అమల్లోకి తెచ్చింది. ఈ హామీకి మహిళల నుంచి విపరీతమైన స్పందన వస్తుంది. 
 
అదేసమయంలో ఆటో డ్రైవర్లు గగ్గోలు పెడుతున్నారు. ఈ పథకం వల్ల తమ జీవనోపాధిపోయిందని అల్లాడుతున్నారు. ఆటోల్లో ప్రయాణించేది అత్యధికంగా మహిళలేనని, అలాంటి మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణం కల్పిస్తే ఆటోలు ఎవరు ఎక్కుతారని వారు ప్రశ్నిస్తున్నారు. పైగా, అనేక ప్రాంతాల్లో ఆందోళనలకు కూడా దిగుతున్నారు. 
 
ఈ నేపథ్యంలో తాజాగా పలువురు ఆటో డ్రైవర్లు ఆర్టీసీ బస్సుల్లో మహిళల వద్దే భిక్షం అడుక్కుంటూ తమ నిరసన తెలియజేశారు. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణంతో ఆటో డ్రైవర్ల బ్రతుకుతెరువు కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తూ, మేడ్చల్‌లో ఆటో డ్రైవర్లు బిక్షం అడుక్కుంటూ నిరసన తెలిపారు.