శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 22 డిశెంబరు 2023 (16:54 IST)

భిక్షాటన చేస్తున్న బిగ్ బాస్ కంటెస్టెంట్, ఎక్కడ?

కర్టెసి-ట్విట్టర్
బిగ్ బాస్ 10 కన్నడ రియాల్టీ షోలో కంటెస్టెంట్‌గా పాల్గొన్న నటుడు హుచ్చా వెంకట్ వీధుల్లో భిక్షాటన చేస్తూ తిరుగుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బెంగుళూరులోని కొడిగేహళ్లి ప్రాంతంలో వెంకట్ పిచ్చివాడిలా తిరుగుతున్నాడని, నీళ్ళు, ఆహారం కోసం ఇంటింటికీ వెళ్లి భిక్షాటన చేస్తున్నాడని ఓ వ్యక్తి సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశాడు.
 
వెంకట్‌ని ఈ స్థితిలో చూడడం బాధాకరం. నా దగ్గర ఉన్న డబ్బు ఇచ్చాను. ఆహారం కోసం ఇంటింటికీ తిరుగుతున్నారు. ప్రస్తుతం కొడిగేహళ్లి ప్రాంతంలో ఉన్నట్లు ఓ వ్యక్తి పేర్కొన్నాడు.
 
బిగ్ బాస్ హౌస్‌లో ఉండగానే తోటి కంటెస్టెంట్‌ను కొట్టి హౌస్‌ నుంచి వెళ్లిపోయాడు. తర్వాత ఇలా వీధుల్లో తిరుగుతున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు మళ్లీ ఇంటింటికి భిక్షాటన చేస్తూ వున్న దృశ్యం కనిపించిందంటూ ఆ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు.