శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 19 అక్టోబరు 2023 (22:28 IST)

బిగ్ బాస్ -7: పల్లవి ప్రశాంత్‌కు పెళ్లైపోయిందా? క్లారిటీ ఏంటి?

Pallavi Prashanth
Pallavi Prashanth
బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్‌ టాప్‌-5 కంటెస్టెంట్‌లలో ఒకడిగా దూసుకుపోతున్నాడు. సీజన్‌ స్టార్ట్‌ అయిన మొదట్లో రతికతో పులిహోర కలిపాడు. రైతుబిడ్డ అంటూ మాటిమాటికి చెప్పడాలు వంటివి పల్లవి ప్రశాంత్‌పై కొంచెం నెగెటివిటీ ఏర్పడేలా చేసింది. కానీ బిగ్‌బాస్‌ హౌజ్‌లో మొదటి కెప్టెన్‌గా నిలిచి సంచలనం అయ్యాడు. 
 
అంతా సాఫీగా జరుగుతున్న టైమ్‌లో పల్లవి ప్రశాంత్‌కు సంబంధించిన పెళ్లి ఫోటో ఒకటి సోషల్ మీడియాను ఊపేస్తుంది. పల్లవి ప్రశాంత్‌కు ముందే పెళ్లి అయిపోయిందని.. తాను కోటీశ్వరుడని ప్రచారాలు మొదలయ్యాయి. 
 
తాజాగా వాటిపై పల్లవి ప్రశాంత్‌ తండ్రి క్లారిటీ ఇచ్చాడు. అందరూ అనుకున్నట్లు పల్లవి ప్రశాంత్‌ కోటీశ్వరుడు కాదని, అవన్నీ అవాస్తవాలేనని చెప్పాడు. బిగ్‌ బాస్‌ హౌజ్‌ నుంచి రాగానే పెళ్లి కూడా చేయాలనుకుంటున్నామని చెప్పుకొచ్చాడు. ఇదంతా ఓ షార్ట్ ఫిలిమ్ కోసమేనని తెలిసింది.