శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 26 ఫిబ్రవరి 2024 (16:38 IST)

అనంత్ అంబానీ ముందస్తు పెళ్లి ఏర్పాట్లు - నక్షత్ర హోటళ్లను తలపించేలా టెంట్లు..

ananth ambani
భారత పారిశ్రామిక దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఆయన ముందస్తు పెళ్లి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. జూలై నెలలో ఈ పెళ్లి జరుగనుంది. గుజరాత్ రాష్ట్రంలోని జామ్ నగర్‌ మార్చి ఒకటో తేదీ నుంచి మూడు రోజుల పాటు ముందస్తు పెళ్లి వేడుకలకు సిద్ధమవుతుంది. 
 
ముఖేశ్ అంబానీ, నీతా అంబానీలకు ముగ్గురు సంతానంలో చిన్నవాడు అనంత్ అంబానీ. ఎన్కోర్ హెల్త్ కేర్ సీఈఓ వీరేన్ మర్చంట్, వ్యాపారవేత్త శైలా మర్చంట్ దంపతుల చిన్న కుమార్తె రాధికా మర్చంట్‌ను అనంత్ పెళ్లి చేసుకోనున్నారు. అయితే జామ్ నగర్ ఐదు నక్షత్ర హోటళ్లు లేకపోవడంతో.. అల్ట్రా - లగ్జరీ టెంట్లను ఏర్పాటు చేస్తున్నారు. అతిథుల కోసం ఏర్పాటు చేసే ఈ టెంట్ టైల్డ్ బాత్రూమ్‌లు సహా సర్వసదుపాయాలు ఉంటాయి. ముందస్తు వివాహ వేడుకలకు ఆహ్వానాలు అందినవారిలో బాలీవుడ్ ప్రముఖులు అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్, క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీ ఉన్నారు.
 
అతిథుల్లో మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్, అడోబ్ సీఈఓ శంతను నారాయణ్, వాల్ట్ డిస్నీ సీఈఓ బాబ్ ఐగర్, బ్లాక్ రాక్ సీఈఓ లారీ ఫింక్, అడ్నాక్ సీఈఓ సుల్తాన్ అహ్మద్ వంటి అంతర్జాతీయ ప్రముఖులు ఉన్నారు.
 
అలాగే, దేశీయ వ్యాపార దిగ్గజాలు గౌతమ్ అదానీ, టాటా సన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్, బిర్లా గ్రూప్ చైర్ పర్సన్ కుమార్ మంగళం బిర్లా, గోద్రేజ్ కుటుంబం, ఇన్ఫోసిస్ ఛైర్మన్ నందన్ నీలేకనీ, ఆర్పీఎస్సీ గ్రూప్ హెడ్ సంజీవ్ గోయెంకా, విప్రో రిషద్ ప్రేమ్, ఉదయ్ కోటక్, అదర్ పూనావాలా, సునీల్ మిత్తల్, పవన్ ముంజాల్, రోష్ని నాడార్, నిఖిల్ కామత్, రొన్నీ సూవాలా, దిలీప్ సంఘ్వీలకు ఆహ్వానాలు అందాయి.
 
క్రికెటర్లలో రోహిత్ శర్మ, హార్దిక్, కృనాల్ పాండ్యా, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్ సహా పలువురు క్రికెటర్లు, బాలీవుడ్ నటులు ఈ వేడుకల ఆహ్వానితుల్లో ఉన్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకలకు ఢిల్లీ, ముంబైల నుంచి ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేశారు. హాలీవుడ్ పాప్ గాయని రిహన్నాతో పాటు దిల్జీత్ దోసాన్జ్, ఇతర గాయకులు ప్రదర్శనలు ఇవ్వనున్నారు.