ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 21 మార్చి 2024 (16:24 IST)

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కొత్త కెప్టెన్ - అధికారిక ప్రకటన

ruturaj - dhoni
మరికొన్ని గంటల్లో ఐపీఎల్ 2024 సీజన్ సందడి ప్రారంభంకానుంది. ప్రారంభ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్లు తలపడనున్నాయి. చెన్నైలోని చిదంబరం స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు సన్నద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు ఆ జట్టు మేనేజ్‌మెంట్ తేరుకోలేని షాక్ ఇచ్చింది. జట్టు సారథ్య బాధ్యతల నుంచి ధోనీని తప్పించి రుతురాజ్‌ను ఎంపిక చేసింది. ఇక నుంచి చెన్నై జట్టుకు రుతురాజ్ సారథ్య బాధ్యతలను వహించనున్నాడు. 
 
గత 16 సీజన్‌లుగా కెప్టెన్ వ్యవహరించిన ధోనీ వయసు రీత్యా ఆ బాధ్యతల నుంచి తప్పించి రుతురాజ్‌కు అప్పగించినట్టు సమాచారం. కాగా, రుతురాజ్ 2023 ఆసియా క్రీడల్లో భారత క్రికెట్ జట్టుకు నాయకత్వం వహించిన అనుభవం ఉంది. పైగా, క్రీజ్‌తో పాటు మైదానంలోనూ అద్భుతంగా రాణించగల సత్తా ఉండటంతో సీఎస్కే మేనేజ్‌మెంట్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.