సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 21 మార్చి 2024 (12:37 IST)

ఐపీఎల్‌కు దూరమైన మహ్మద్ షమీ - గుజరాత్ టైటాన్స్‌కు కొత్త పేసర్

shami
ఈ నెల 22వ తేదీ నుంచి ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభంకానుంది. అయితే, భారత్ స్టార్ బౌలర్ మహ్మద్ షమీ చీలమండ గాయం కారణంగా ఈ టోర్నీకి దూరమయ్యారు. ఆయన చీలమండకు సర్జరీ చేసుకోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. దీంతో షమీ ప్రాతినిథ్యం వహించే గుజరాత్ టైటాన్స్ జట్టు యాజమాన్యం షమీ స్థానంలో కొత్త బౌలర్‌ను తీసుకుంది. సందీప్ వారియర్ అనే పేసర్‌ జీటీలో చేశారు. ఈ విషయాన్ని ఐపీఎల్ పాలక మండలి కూడా అధికారికంగా ప్రకటించారు. మహ్మద్ షమీ ప్రస్తుతం కోలుకుంటున్నాడని, అతడి స్థానంలో తీసుకున్న సందీప్ ఇప్పటివరకు 5 ఐపీఎల్ మ్యాచ్లు ఆడాడని వెల్లడించింది. సందీప్‌ను బేస్ ధర రూ.50 లక్షల మొత్తానికి గుజరాత్ దక్కించుకున్నట్టు వివరించింది. 
 
మరోవైపు గాయం కారణంగా 2024 ఎడిషన్ నుంచి మధుశంక వైదొలగడంతో అతడి స్థానంలో అండర్-19 వరల్డ్ కప్లో మెరిసిన దక్షిణాఫ్రికా ఆటగాడు క్వేనా మఫాకాను ముంబై ఇండియన్స్ జట్టులోకి తీసుకుందని ఐపీఎల్ పాలకమండలి వెల్లడించింది. కాగా సందీప్ వారియర్ కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున 2019 - 2021 మధ్య 5 మ్యాచ్‌లలో ఆడాడు. 
 
మధుశంక ఐపీఎల్ 2024 ఎడిషన్‌కు దూరమయ్యాడని ఐపీఎల్ పాలకమండలి నిర్ధారించింది. దిల్షాన్ మధుశంక గాయం కారణంగా తొలగాడని తెలిపింది. అతడి స్థానంలో తీసుకున్న క్వేనా మఫాకా దక్షిణాఫ్రికాకు చెందిన ఆటగాడని, ఎడమచేతి వాటం పేసర్ అని తెలిపింది. 
 
ఇటీవల ముగిసిన ఐసీసీ అండర్-19 పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ దక్షిణాఫ్రికాకు ప్రాతినిధ్యం వహించాడని, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ కూడా ఎంపికయ్యాడని పేర్కొంది. బేస్ ధర రూ.50 లక్షల మొత్తానికి ముంబై ఇండియన్స్ అతడిని జట్టులో చేర్చుకుందని వివరించింది.