శుక్రవారం, 12 జులై 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 19 మార్చి 2024 (11:52 IST)

హార్దిక్ పాండ్యాను ఏకిపారేస్తున్న రోహిత్ ఫ్యాన్స్.. ఎందుకో తెలుసా?

Hardik Pandya
Hardik Pandya
ముంబై ఇండియన్స్ జట్టు సారథిగా హార్దిక్ పాండ్యాను ప్రకటించారు. అయితే కెప్టెన్సీ మార్పు నిర్ణయంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా రోహిత్ శర్మ అభిమానులు కెప్టెన్సీ మార్పును జీర్ణించుకోలేకపోతున్నారు. 
 
ఇప్పటికే ముంబై ఇండియన్స్ సోషల్ మీడియా ఖాతాలను లక్షల మంది అన్‌ఫాలో చేశారు. ముంబై ఇండియన్స్ కెప్టెన్సీగా బాధ్యతలు తీసుకున్నాక రోహిత్ శర్మ మాట్లాడలేదు. 
 
తన సారథ్యంలో ఆడేందుకు రోహిత్ శర్మకు ఎలాంటి ఇబ్బంది ఉండదు... అంటూ చెప్పుకొచ్చాడు. అయితే రోహిత్ శర్మ ఫ్యాన్స్ మాత్రం #RIPHARDIKPANDYA అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. 
 
కాగా మార్చి 22 నుంచి ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభం కానుండగా.. 24న అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగే మ్యాచ్‌తో ముంబై ఇండియన్స్ బరిలోకి దిగనుంది.