ధోనీ గాయంతోనే ఫ్యాన్స్ కోసం ఆడుతున్నాడు : కోచ్ ఎరిక్ సిమన్స్
వాంఖడే వేదికగా ముంబైతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై స్టార్ ప్లేయర్ ధోనీ విజృంభించాడు. నాలుగు బంతుల్లో 20 పరుగులు సాధించాడు. తద్వారా ముంబైపై చెన్నై గెలిచేందుకు కీలకంగా మారింది. ప్రస్తుతం ధోనీకి సంబంధించిన ఓ వార్త వైరల్ అవుతోంది. వైజాగ్ మ్యాచ్‌లో తన కాలికి ప్రత్యేకమైన పట్టీతో ధోనీ కనిపించాడు.
తాజాగా ఆ నొప్పిని భరిస్తూనే ముంబైపై హిట్టింగ్ చేశాడని.. చెన్నై బౌలింగ్ కోచ్ ఎరిక్ సిమన్స్ తెలిపాడు. ముంబై బౌలింగ్‌కు ధీటుగా ధోనీ ఆడటం ఆశ్చర్యంగా అనిపించింది.
జట్టు స్కోర్ ఒకే ఒక్క ఓవర్‌తో 206 పరుగులకు చేరింది. క్రీజులోకి దిగడంతోనే ధోనీ సిక్సర్లు కొట్టాడు. గత ఐపీఎల్ తర్వాత ధోనీ మోకాలికి శస్త్రచికిత్స జరిగింది. అప్పుడప్పుడు మళ్లీ నొప్పి తిరగబడుతోంది.
అయినా సరే అభిమానుల కోసం బ్యాటింగ్ చేస్తున్నాడు ధోనీ.. ఇప్పటివరకు తాను చూసిన క్రికెటర్లలో ధోనీ అరుదైన వ్యక్తి అని కోచ్ తెలిపాడు. ఈ నొప్పితో కూడా కెరీర్‌లో కొనసాగుతాడా లేదా అనేది చెప్పలేం. ఎందుకంటే.. ధోనీ నిర్ణయం అంత కచ్చితంగా వుంటుంది.. అంటూ చెప్పుకొచ్చాడు.