మంగళవారం, 21 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 29 ఏప్రియల్ 2024 (10:48 IST)

చెన్నై-హైదరాబాద్ మ్యాచ్.. మహేంద్ర సింగ్ ధోనీ ఖాతాలో రికార్డ్

Dhoni
ఐపీఎల్ 2024లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్- సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య హైఓల్టేజ్ మ్యాచ్ జరుగనుంది. చెన్నై చిదంబరం స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ గెలుపును నమోదు చేసుకుంది. 
 
ఇందులో భాగంగా ఐపీఎల్‌లో మహేంద్రసింగ్ ధోనీ మరో రికార్డు సృష్టించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో చెన్నైలో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 78 పరుగుల తేడాతో విజయం సాధించింది. 
 
ఈ విజయంతో ధోనీ ఖాతాలో ఈ అరుదైన రికార్డు వచ్చి చేరింది. టీ20 టోర్నమెంట్ చరిత్రలో 150 విజయాల్లో పాలుపంచుకున్న ఒకే ఒక్క క్రికెటర్‌గా అవతరించాడు. 
 
2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి ధోనీ ఇప్పటి వరకు 259 మ్యాచ్‌లు ఆడాడు. చెన్నైకి సారథిగా ఐదు ఐపీఎల్ టైటిళ్లు అందించాడు. ప్రస్తుత సీజన్‌లో ఆ జట్టుకు రుతురాజ్ గైక్వాడ్ సారథ్యం వహిస్తున్నాడు.