గురువారం, 28 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 27 ఏప్రియల్ 2024 (22:49 IST)

ముంబైపై ఢిల్లీ క్యాపిటల్స్ గెలుపు.. మెరవని రోహిత్ శర్మ.. భయపెట్టిన డీసీ

DC v MI
DC v MI
అరుణ్ జైట్లీ స్టేడియంలో శనివారం జరిగిన ఐపిఎల్ మ్యాచ్‌లో ముంబైపై ఢిల్లీ క్యాపిటల్స్ 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 257 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీకి ఇదే అత్యధిక స్కోరు.
 
ఢిల్లీ ఆటగాళ్లలో జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ (84 పరుగులు; 27 బంతుల్లో, 11x4, 6x6) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ట్రిస్టన్ స్టబ్స్ (48 పరుగులు; 25 బంతుల్లో, 6x4, 2x6), షై హోప్ (41 పరుగులు; 17 బంతుల్లో, 5x6) సత్తాచాటారు. ముంబై బౌలర్లలో బుమ్రా (1/35) మినహా మిగిలినందరూ ధారాళంగా పరుగులు ఇచ్చారు.
 
అనంతరం ముంబై ఇండియన్స్ 20 ఓవర్లకు తొమ్మిది వికెట్లు కోల్పోయి 247 పరుగులు చేసింది. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ (63; 32 బంతుల్లో, 4x4, 4x,6) అద్భుతంగా పోరాడాడు. హార్దిక్ పాండ్యా (46), టిమ్ డేవిడ్ 37 పరుగులు సాధించారు. 
 
ఈ క్రమంలోనే ముంబై పవర్‌ప్లేలో 65 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన హార్దిక్ పాండ్య తిలక్‌తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. స్పిన్నర్లను లక్ష్యంగా చేసుకుని హార్దిక్ భారీ షాట్లు ఆడాడు. 
 
ఈ క్రమంలో 25 బంతుల్లో అర్ధశతకం సాధించాడు. మిగిలిన బ్యాట్స్‌మెన్లు ధీటుగా రాణించకపోవడంతో ముంబైకి ఓటమి తప్పలేదు. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు అదిరే ఆరంభం దక్కింది. ఈ క్రమంలో ఫ్రేజర్ 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. ఢిల్లీ తరఫున ఫాస్టెస్ హాఫ్ సెంచరీ రికార్డును రెండో సారి సాధించాడు.