ఆదివారం, 8 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 24 ఏప్రియల్ 2024 (13:29 IST)

పెండ్లి కూడా రిస్కే - త్వరలో ఆ రిస్క్ గురించి చెబుతా: వరలక్ష్మి శరత్‌కుమార్‌

Varalaxmi Sarathkumar
Varalaxmi Sarathkumar
జీవితంలో యంగ్ ఏజ్ లో తనకు మైండ్ మెచ్యూర్డ్ వచ్చిందనీ అలా సినిమాల్లో ఏ పాత్ర ఎంపిక చేసుకోవాలో అంచనా వేయగలిగానని నటి వరలక్ష్మి శరత్‌కుమార్‌ అన్నారు. ఇటీవలే ఆమె నటించిన హనుమాన్ వంద రోజులు ఆడింది. ఇలా ఆడుతుందని అస్సలు అనుకోలేదు. ఇదే కాదు ఏదీ ముందుగా ఇలా జరుగుతుందని తెలీదు. జీవితంలో ప్రతీదీ రిస్కే. రేపు ఏం జరుగుతుందో తెలీదు. మనం ఒక్కోసారి చాలా రిస్క్ చేసి సినిమా చేస్తే అది పెద్దగా ఆడదు అని వివరించారు.
 
మరి జీవితంలో ఇన్ని రిస్క్ లు వున్నాయన్న మీరు.. కెరీర్, పెండ్లి కూడా ఒక్క రిస్క్ లా చూస్తున్నారా? అన్న ప్రశ్నకు బదులిస్తూ, నిజమే పెండ్లి కూడా రిస్కే. సరైన వాడిని ఎంపికచేసుకోవడంలో..అంటూ నవ్వుతూ చెప్పేసింది. త్వరలో నా పెండ్లి గురించి మీకు అన్ని వివరాలు తెలియజేస్తానని తెలిపింది.
 
2 మార్చి 2024న, వరలక్ష్మి శరత్‌కుమార్‌కి ముంబైలో గ్యాలరిస్ట్ అయిన నికోలాయ్ సచ్‌దేవ్‌తో నిశ్చితార్థం జరిగింది. తనకూ, వరలక్మికి వయస్సు వ్యత్యాసం వుంది. తను తనకు చిన్నతనం నుంచి తెలుసునని ఓసారి వెల్లడించింది.