గురువారం, 9 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 25 ఏప్రియల్ 2024 (17:36 IST)

తను కొట్టిన సిక్సర్ కారణంగా గాయపడిన కెమెరామెన్... సారీ చెప్పిన పంత్!

rishabh panth
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ పెద్ద మనసు చాటుకున్నాడు. తాను కొట్టిన సిక్సర్ కారణంగా మైదానంలో కెమెరామెన్ గాయపడ్డాడు. దీంతో ఆ కెమెరామెన్‌గు సారీ చెప్పాడు. సదరు వ్యక్తి త్వరగా కోలుకోవాలని క్షమాపణ సందేశాన్ని పంపించాడు. దీనికి సంబంధించిన వీడియోను ఐపీఎల్ ట్విట్టర్ షేర్ చేసింది. దీంతో పంత్ నామస్మరణతో సోషల్ మీడియా మంగళవారం నుంచి మార్మోగిపోతుంది. 
 
కాగా, మంగళవారం గుజరాత్ టైటాన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో రిషబ్ పంత్ బ్యాట్‌తో రెచ్చిపోయిన విషయం తెల్సిందే. ఈ మ్యాచ్‌లో విరుచుకుపడి తన జట్టును గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో 43 బంతులను ఆడిన పంత్ ఎనిమిది సిక్సర్లు, ఐదు ఫోర్ల సాయంతో 88 పరుగులు చేసి పరుగులు చేసి అజేయంగా నిలిచారు. 
 
ఈ క్రమంలో పంత్ బ్యాట్ నుంచి జాలువారిన సిక్సర్లతో ఒకటి బీసీసీఐ ప్రొడక్షన్ క్రూకు సంబంధించిన కెమెరామెన్‌కు తగిలింది. ఇది తెలిసి పంత్ మ్యాచ్ అనంతరం దేబశిష్ అనే సదరు కెమెరామెన్‌కు క్షమాపణ సందేశం పంపించాడు.