ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 29 మార్చి 2024 (12:46 IST)

గంగోత్రి విడుదలైన రోజే అల్లు అర్జున్ మైనపు బొమ్మ

allu arjun
అల్లు అర్జున్ కొత్తగా ఆవిష్కరించిన మైనపు విగ్రహంతో సెల్ఫీని పంచుకున్నాడు. ఆ తర్వాత ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పుష్ప-2 స్టార్ అల్లు అర్జున్ మైనపు విగ్రహంతో గౌరవించబడ్డాడు. దుబాయ్‌లో ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. 
 
ఆపై ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా, అర్జున్ విగ్రహంతో ఉన్న ఫోటోను కూడా షేర్ చేశాడు. ఈ సందర్భంగా మైనపు విగ్రహంతో కూడిన ఐకానిక్ పుష్ప ఫోజును రిపీట్ చేశాడు. అర్జున్ ఇండస్ట్రీకి వచ్చి 21 ఏళ్లు పూర్తి చేసుకున్న రోజునే మైనపు విగ్రహం ఆవిష్కరణ జరిగింది.
 
ఈ సందర్భంగా ఎక్స్‌లో అతని తాజా మైలురాయికి అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేశాడు. గంగోత్రి విడుదలైన అదే తేదీలో దుబాయ్‌లో మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించడం ఎంతో హ్యాపీగా వుందని అల్లు అర్జున్ తెలిపాడు.