బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 28 మార్చి 2024 (17:36 IST)

అల్లు అర్జున్ 21 సంవత్సరాల జర్నీ, దుబాయ్‌లో తన మైనపు విగ్రహం

Allu Arjun's 21 year journey
Allu Arjun's 21 year journey
అల్లు అర్జున్ 21 సంవత్సరాల సినీ కెరీర్ సందర్భంగా ఈ సాయంత్రం గ్రాండ్ లాంచ్‌కు ముందు మేడమ్ టుస్సాడ్స్ దుబాయ్‌లో తన మైనపు విగ్రహం పక్కన పోజులిచ్చి దాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇన్నేళ్ళ ఈ మైలురాయికి ఉత్సాహంగా మరియు కృతజ్ఞతతో ఉన్నానని తెలియజేశారు.
 
గంగోత్రి నుంచి పుష్ప వరకు భారతీయ సినిమాలో ఐకాన్ స్టార్ గా అసాధారణ 21 సంవత్సరాల ప్రయాణం. నటుడి అసమానమైన ప్రతిభ, బహుముఖ ప్రజ్ఞ, అంకితభావం భారతీయ చలనచిత్రంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పాయి. ఆర్య నుంచి తనదైన కోణంలో సుకుమార్ చూసి ఐకాన్ స్టార్ గా బిరుదు ఆపాదించారు. 
 
నటుడిగా ఫిల్మ్ ఇండస్ట్రీలో తన 20వ సంవత్సరాన్ని పూర్తిగా జరుపుకోవడానికి మీ ప్రేమ మరియు ప్రయాణానికి కృతజ్ఞతలు మరియు ఆశీర్వాదాలు అభిమానులకు తెలిపారు. ఈ రోజు, తాను చిత్ర పరిశ్రమలో 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్నానని మరియు అందరి ప్రేమ కోసం చాలా ఆశీర్వాదం పొందానని ఆయన పేర్కొన్నాడు.
అల్లు అర్జున్ పుష్ప: ది రైజ్‌లో తన నటనతో పాన్ ఇండియన్ స్టార్ స్థాయికి ఎదిగాడు.