బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 25 మార్చి 2024 (15:25 IST)

"రంగస్థలం" కాంబో రిపీట్... సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ 17వ చిత్రం!

ram charan - sukumaran
"రంగస్థలం" చిత్రం కాంబినేషన్ రిపీట్ కానుంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించే 17వ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. ఈ ప్రాజెక్టుకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చుతున్నారు. హోలీ పండుగను పురస్కరించుకుని సోమవారం ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన వెల్లడించారు. 
 
ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో "పుష్ప-2" చిత్రం తెరకెక్కుతుంది. అలాగే, రామ్ చరణ్ కూడా శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్''లో నటిస్తున్నారు. ఇటీవల బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రామ్ చరణ్ నటించే మరో కొత్త చిత్రం ప్రారంభమైంది. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత ఆర్సీ 17వ చిత్రం పట్టాలపైకి వెళ్లనుంది.
rc17 announcement
 
కాగా, గతంలో రామ్ చరణ్ - సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 'రంగస్థలం' చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన విషయం తెల్సిందే. ఇపుడు మరోమారు వీరిద్దరూ మళ్లీ కలిసి పని చేయనున్నారు. 'రంగస్థలం' చిత్రంలో రామ్ చరణ్ అద్భుతంగా నటించిన విషయం తెల్సిందే. కాగా, అల్లు అర్జున్‌ - సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందుతున్న 'పుష్ప-2' చిత్రం ఈ యేడాది విడుదలకానుంది.