మహేష్ బాబు బాటలోనే లండన్ లో ప్రభాస్?
ఈమధ్య చాలామంది హీరోలు తరచూ విదేశాలకు టూర్ లు వెళుతుంటారు. యు.ఎస్.తోపాటు పలు దేశాలకు వెళ్ళి అక్కడ కొద్దిరోజులు బసచేసి వస్తుంటారు. మహేష్ బాబు కూడా పలుసార్లు అలా వెళుతూ అక్కడ తన ప్రాపర్టీని చూసుకునేందుకు అక్కడ నివాసం వున్నాడని నిరూపించుకునేందుకు ఆ దేశ లెక్కల ప్రకారం అలా వెళ్ళి వస్తుంటారనే టాక్ ఇండస్ట్రీలో నెలకొంది. అలాగే మిగిలిన హీరోలుకూడా.
తాజాగా ప్రభాస్ కూడా ఆ రూటులోనే వెళుతూ లండన్ లో సొంత ఇల్లు కొనుగోలు చేశారనే టాక్ కూడా వుంది. ఇప్పటి ట్రెండ్ కు తగినట్లు సినిమాలన్నీ విదేశాల్లోనూ ఎక్కువగా జరుగుతున్నాయి. దానికి కారణం ఓవర్ సీస్ వ్యాపారంతోపాటు కథలు కూడా అక్కడివే కావడం విశేషం. అందుకే తరచూ వెళ్ళి అక్కడ కోట్ల రూపాయల రెంట్ కట్టే బదులు కొత్తగా ఇంటిని కొనుగోలుచేసుంటారని తెలుస్తోంది. ప్రభాస్ తాజాగా కల్కి 2898AD) చిత్రం తో బిజీగా ఉన్నారు. దర్శకుడు మారుతీ సినిమాకూడా చేస్తున్నాడు.