ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 13 మార్చి 2024 (14:27 IST)

మహేష్ బాబు- రాజమౌళి కాంబో.. SSMB 29లో ప్రిన్స్ డుయెల్ రోల్?

mahesh babu
సూపర్ స్టార్ మహేష్ బాబు- ఎస్ఎస్ రాజమౌళి కాంబోలో కొత్త సినిమా తెరపైకి రానుంది. బాహుబలి, ఆర్ఆర్ఆర్ తర్వాత మహేష్ బాబుతో జక్కన్న చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. SSMB 29 అని పిలువబడే ఈ ఇంకా పేరు పెట్టని ఈ చిత్రంపై ఇప్పటికే కసరత్తులు ప్రారంభించారు జక్కన్న. 
 
త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక టైటిల్ వచ్చే ఛాన్సుందని టాక్. 2024లోనే ఈ చిత్రం ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమాలో మహేష్ బాబు ద్విపాత్రాభినయం చేయనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
 
గుంటూరు కారంతో మంచి హిట్ కొట్టిన మహేష్ బాబు జక్కన్న సినిమాలో ద్విపాత్రాభినయంతో సరికొత్త సవాలును ఎదుర్కొంటారని తెలుస్తోంది. బాహుబలిలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేశారు. ఇదే తరహాలో మహేష్ బాబు కూడా పవర్ ఫుల్ రోల్‌లో కనిపిస్తారని తెలుస్తోంది.