1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 13 ఫిబ్రవరి 2024 (13:57 IST)

బ్రేకింగ్ న్యూస్ బ్యాచ్.. కుర్చీ మడత పెట్టి ఆఫరా.. నాకు రాలేదే..!

జబర్దస్త్ ద్వారా యాంకర్‌గా ఆపై యాక్టర్‌గా మారిన నటి రష్మీ గౌతమ్ తనపై వచ్చే వార్తలపై స్పందించింది. బ్రేకింగ్ న్యూస్ బ్యాచ్ కళ్లకు కట్టేలా సొంతంగా వార్తలను క్రియేట్ చేస్తున్న వారికి రష్మీ కౌంటర్ ఇచ్చింది. 
 
"గుంటూరు కారం"లో పూర్ణ చేసిన రోల్ తనకు వచ్చిందని రాస్తున్న మీడియాపై ఫైర్ అయ్యింది. కుర్చీ మడతపెట్టి పాటలో, పూర్ణ అతిథి పాత్రలో రెండు డైలాగ్స్, డ్యాన్స్ స్టెప్పులతో కనిపించింది. అయితే పూర్ణ రోల్ రష్మీకి వచ్చిందని.. అలాంటి ఆఫర్ వచ్చినా మహేష్ బాబుతో స్క్రీన్ పంచుకోవడం, అతనితో డ్యాన్స్ చేయడం రష్మీకి ఇష్టం లేదని వార్తలు వచ్చాయి. 
 
దీనిపై రష్మీ మాట్లాడుతూ.. ఇది ఫేక్ న్యూస్ అని రష్మీ పేర్కొంది. ఈ వార్తలు పూర్తిగా నిరాధారం. ఈ రోల్ కోసం నన్ను సంప్రదించలేదు కాబట్టి తిరస్కరణకు అవకాశం లేదు. అలాగే పూర్ణ గారు ఎవ్వరూ చేయని అద్భుతమైన పని చేసారు. ఇలాంటి ఫేక్ న్యూస్‌లను, దయచేసి అలాంటి వార్తలను ప్రోత్సహించకండి.. అంటూ సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చింది.