బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 25 మార్చి 2024 (11:53 IST)

లండన్‌లో పీహెచ్‌డీ చేస్తోన్న భారతీయ విద్యార్థిని మృతి.. భర్త ముందే అలా?

Cheistha
Cheistha
లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో పీహెచ్‌డీ చదువుతున్న భారతీయ విద్యార్థిని మార్చి 19న సైకిల్ ప్రమాదంలో మృతి చెందారు. గుర్గావ్‌కు చెందిన 33 ఏళ్ల చేష్టా కొచర్, కాలేజీ పూర్తయ్యాక లండన్‌‌లోని తన ఇంటికి తిరిగి వస్తుండగా లారీ ఢీకొనడంతో మరణించింది. 
 
ఈ ఘటన జరిగినప్పుడు ఆమె భర్త ఆమెకు కొన్ని మీటర్ల ముందు సైకిల్‌పై వెళ్తున్నాడు. చెయిస్టా సంఘటన స్థలంలోనే మరణించింది. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో జన్మించిన చెయిస్తా పిహెచ్‌డి చేయడానికి సెప్టెంబర్‌లో లండన్‌కు వెళ్లింది. పూర్తి స్కాలర్‌షిప్‌పై చదువుకునే అవకాశాన్ని పొందింది.

ఆమె చదువుకు ముందు నీతి ఆయోగ్, బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్‌లో పనిచేసింది. చేష్ట తన తెలివితేటలతో రాణించింది. ఇంకా హార్డవర్కర్ కూడా అంటూ సన్నిహితులు చెప్తున్నారు.