శుక్రవారం, 29 ఆగస్టు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 28 ఆగస్టు 2025 (09:42 IST)

రీల్స్ కోసం బైకుపై స్టంట్స్ - గాల్లో కలిసిన ప్రాణాలు

death
రీల్స్‌ ద్వారా సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు బైకుపై రిస్కీ స్టంట్స్ చేసిన ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకర ఘటన బీహార్ రాష్ట్రంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నాకు చెందిన శుభం, ఆనంద్ కుమార్, సోను కుమార్ అనే ముగ్గురు పదో తరగతి విద్యార్థులు రీల్స్ చేయడానికి బైకుపై ముంగేర్‌లోని జాతీయ రహదారి 80పైకి వచ్చారు. ఆ రహదారిపై వారు అమిత వేగంగా బైకు నడుపుతున్న క్రమంలో రహదారిపై ఆగివున్న బస్సును గమనించకుండా ఢీ కొట్టడంతో శుభం, ఆనంద్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సోనూ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. 
 
ఈ ముగ్గురు స్నేహితులు బైకుపై రీల్స్ చేస్తున్న సమయంలో బైకు నడుపుతున్న యువకుడు నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు ప్రమాదకరంగా రీల్స్ చేయొద్దని ప్రచారం చేస్తున్నప్పటికీ యువత తరచూ ఈ విధంగా ప్రమాదాల బారినపడుతున్నారని ముంగేర్ ఎస్పీ ఇమ్రాన్ మసూద్ ఆవేదన వ్యక్తం చేశారు.