బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 18 జూన్ 2024 (17:07 IST)

పవన్ కోసం పరుగులు తీసిన యువతి.. కాన్వాయ్‌తో పోటీ పడి రన్ (video)

Pawan Kalyan
Pawan Kalyan
సచివాలయానికి మొదటిసారి వెళ్తున్న ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు అమరావతి రైతులు బ్రహ్మరథం పట్టారు. చిన్నాపెద్దా తేడా లేకుడా పవన్ కల్యాణ్‌ను చూసేందుకు అమరావతి రైతులు, ఫ్యాన్స్ కాన్వాయ్ వెంట పడ్డారు. 
 
ఇంకా ఓ మహిళా అభిమాని పవన్ కల్యాణ్‌ను చూసేందుకు ఆ కాన్వాయ్ వెంట పరుగులు తీసింది. కాన్వాయ్ వేగానికి ఈడు కట్టింది. పవన్ కన్వాయ్ వెంట బైకులు పరుగులు తీస్తుంటే.. ఆ మహిళ పవన్‌ను చూసిన ఆనందంలో కాన్వాయ్ వేగాన్ని సులువుగా అందుకుంది. 
 
ఆ యువతి పరుగును చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఆ వీడియోను కాస్త వైరల్ చేస్తున్నారు. అలాగే జనసేనాని క్యాంప్ ఆఫీసులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛాలు అందజేశారు. ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు.