ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 13 జూన్ 2024 (20:54 IST)

చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే కోడలు త్రిషా రెడ్డి.. బాబు ప్రమాణ స్వీకారంలో హైలైట్

Trisha
Trisha
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవంలో పులివర్తి నాని కోడలు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికైన పులివర్తి నాని కోడలే ఈ త్రిషారెడ్డి. ప్రమాణమహోత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా మారిన ఆమె.. తన అత్తమామలు.. భర్తతో కలిసి ఈ ప్రమాణస్వీకారోత్సవానికి హాజరయ్యారు. 
 
చంద్రగిరి నియోజకవర్గంలో చిన్న పిల్లల కోసం మెడికల్ క్యాంపుల్ని నిర్వహించటం ద్వారా మంచి పేరును సొంతం చేసుకున్నారు త్రిషారెడ్డి. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తన మామ గెలుపు కోసం ఆమె చేసిన ప్రచారం అందరిని ఆకర్షించింది.
 
తన మామ పులిపర్తి నానికి ఓటేయాలని కోరుతూ ఆమె చేసిన వీడియో వైరల్‌గా మారింది. వైఎస్ జగన్‌కు అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రాతినిధ్యం వహించే చంద్రగిరిలో ఈసారి తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది.