1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 18 జూన్ 2024 (13:25 IST)

చంద్రబాబు పక్కనే పవన్ కల్యాణ్ ఫోటో.. ఎక్కడ.. ఏంటి సంగతి? (video)

Pawan-CBN
Pawan-CBN
ఏపీలో తెలుగుదేశం కూటమి సర్కారు ఏర్పాటైంది. ఈ సర్కారులో సీఎం నారా చంద్రబాబు నాయుడు సీఎం అయితే పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా అత్యంత కీలకమైన బాధ్యతలను చేపట్టారు. కూటమి నుంచి అన్ని రకాలైన గౌరవ మర్యాదలు ఆయనకు దక్కుతున్నాయి. అంతేగాకుండా చంద్రబాబుకు సమానంగా పవన్‌కి ప్రోటోకాల్ వంటివి దక్కుతున్నాయి. అలాగే నారా చంద్రబాబు నాయుడు ఫోటోకు పక్కనే పవన్ కల్యాణ్ బొమ్మ వుంది. సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 
 
ప్రభుత్వ ఆఫీసుల్లో కేవలం సీఎం ఫోటో పక్కనే మరో ఫోటో పెట్టడం వుండదని టాక్. ఏది ఏమైనప్పటికీ అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం కూడా కనిపించనుంది. ఏపీ సర్కారు ఆఫీసుల్లో ఏపీ సీఎం ఫోటోతో పాటు డిప్యూటీ సీఎం ఫోటోను కూడా ఉంచుతున్నారు. మంత్రుల ఛాంబర్లలోనూ ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం ఫోటోలను వుంచాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.