సంబంధిత వార్తలు
- స్వయంగా కారు నడుపుతూ కనిపించిన కేసీఆర్.. బీఆర్ఎస్ వర్గాల్లో ఖుషీ (video)
- తెలంగాణలో చలి: కొమరం భీమ్ జిల్లాలో వణికిపోతున్న జనం
- ఒకే ఒక్క విద్యార్థిని... పాఠశాల యేడాది ఖర్చు రూ.12.48 లక్షలు (Video)
- మా సిఫార్సు లేఖలను పరిగణనలోకి తీసుకోండి.. బీఆర్ నాయుడికి హరీశ్ వినతి (Video)
- జ్వరంతో విద్యార్థిని మృతి.. టీచర్లపై కేసు నమోదు.. ఎందుకని?
అయ్యప్పమాల ధరించిన ఆర్టీసీ డ్రైవర్‌కు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ (Video)
ప్రమాదాలను నివారించేందుకు వీలుగా ఆర్టీసీ ఉన్నతాధికారులు గట్టి చర్యలు తీసుకుంటున్నారు. ఇందులోభాగంగా, బస్సు డ్రైవర్లకు విధిగా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలను నిర్బంధం చేశారు. అయితే, అయ్యప్ప మాల ధరించిన డ్రైవర్లకు కూడా ఈ తరహా పరీక్షలు చేయడం ఇపుడు వివాదాస్పదంగా మారింది. ఆర్టీసీ అధికారుల చర్యను అయ్యప్ప స్వాములు తీవ్రంగా ఖండిస్తూ తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ - తొర్రూరు పట్టణ కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో గురువారం విధులకు హాజరయ్యేందుకు వచ్చే డ్రైవర్లకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. అయితే, అయ్యప్ప మాల ధరించిన ఆర్టీసీ డ్రైవర్ నాగరాజుకు కూడా ఈ తరహా పరీక్ష చేశారు.. తాను పవిత్రమైన అయ్యప్ప మాల ధరించానని డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయవద్దని డ్రైవర్ నాగరాజు ఎంత చెప్పినా ఆర్టీసీ అధికారులు పట్టించుకోలేదు. దీంతో నాగరాజు తీవ్ర మనోవేదనకు గురయ్యారు.
అయ్యప్ప మాల ధరించిన ఆర్టీసీ డ్రైవర్‌కు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు..
— Telugu Scribe (@TeluguScribe) November 28, 2024
మహబూబాబాద్ - తొర్రూరు పట్టణ కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో డ్యూటీకి వచ్చే డ్రైవర్లకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల్లో భాగంగా.. అయ్యప్ప మాల ధరించిన ఆర్టీసీ డ్రైవర్ నాగరాజుకు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసిన… pic.twitter.com/qanfRNGD8L
