గురువారం, 28 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 28 నవంబరు 2024 (11:46 IST)

లోక్‌సభ సభ్యురాలిగా ప్రియాంకా గాంధీ ప్రమాణ స్వీకారం

Priyanka Gandhi
Priyanka Gandhi
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా గురువారం లోక్‌సభలో పార్లమెంటు సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యాంగ ప్రతిని పట్టుకుని ఆమె పార్లమెంటు సభ్యురాలిగా ప్రమాణం చేశారు. కాగా, ప్రియాంక గాంధీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆమె తల్లి సోనియా గాంధీ, సోదరుడు రాహుల్ గాంధీ, రైహాన్ వాద్రా, ప్రియాంక, రాబర్ట్ వాద్రాల కుమారుడు, కుమార్తె మిరాయా వాద్రా కూడా పార్లమెంట్‌కు చేరుకున్నారు. 
 
ప్రియాంక గాంధీ వాద్రా వయనాడ్ లోక్‌సభ స్థానం నుంచి 4,10,931 ఓట్ల ఆధిక్యతతో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ)కి చెందిన సత్యన్ మొకేరిపై విజయం సాధించారు. కాంగ్రెస్ కంచుకోట అయిన వాయనాడ్‌లో ప్రియాంక గాంధీ, బీజేపీకి చెందిన నవ్య హరిదాస్, సీపీఐకి చెందిన సత్యన్ మొకేరి మధ్య ముక్కోణపు పోటీ నెలకొంది. 
 
అలాగే కాంగ్రెస్ నేత రవీంద్ర వసంతరావు చవాన్ కూడా లోక్‌సభలో పార్లమెంటు సభ్యునిగా ప్రమాణం చేశారు. నాందేడ్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రవీంద్ర వసంతరావు చవాన్ 5,86,788 ఓట్లతో విజయం సాధించారు. సిట్టింగ్‌ కాంగ్రెస్‌ ఎంపీ వసంతరావు బల్వంతరావు చవాన్‌ మృతి చెందడంతో ఈ స్థానం ఖాళీగా ఉండడంతో ఉప ఎన్నిక అవసరం అయింది.