మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 28 నవంబరు 2024 (09:28 IST)

భువనేశ్వర్‌: నాలుగేళ్ల బాలికను.. రూ.40వేలకు అమ్మేశారు.. ఎందుకంటే?

victim girl
భువనేశ్వర్‌లో నాలుగేళ్ల బాలికను తల్లిదండ్రులు రూ.40 వేలకు అమ్మేసిన ఘటన సంచలనం సృష్టించింది. బీహార్‌కు చెందిన రోజువారీ కూలీలైన దంపతులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల కారణంగా బాలికను అమ్మేశారని పోలీసుల విచారణలో వెల్లడి అయ్యింది. 
 
వివరాల్లోకి వెళితే.. బడగడ ప్రాంతానికి చెందిన ఇద్దరు మధ్యవర్తుల సహకారంతో చిన్నారిని పిపిలిలోని మరో దంపతులకు విక్రయించారు. పక్కా సమాచారంతో వెంటనే రంగంలోకి దిగిన బడగడ పోలీసులు బాలికను రక్షించి కేసు దర్యాప్తు చేపట్టారు. 
 
దంపతులు పనిచేస్తున్న ఓ అపార్ట్‌మెంట్ యజమాని తమను అప్రమత్తం చేశారని బడగడ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ తృప్తి రంజన్ నాయక్ వెల్లడించారు. దీనిని అనుసరించి.. మధ్యవర్తులను పోలీసులు గుర్తించారు. పేదరికం కారణంగా కూలీలు అయిన దంపతులు తమ బిడ్డను అమ్మారని విచారణలో పోలీసులకు తెలియవచ్చింది. 
 
గతవారం, బోలంగీర్ జిల్లాలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా నవజాత శిశువును ఆమె తల్లిదండ్రులు విక్రయించారని ఆరోపిస్తూ రక్షించారు. ఇలాంటి ఘటనలు భువనేశ్వర్‌లో అధికంగా నమోదు అవుతున్నాయి.