బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 25 నవంబరు 2024 (09:46 IST)

పెంపుడు శునకానికి పిల్లలు... వేడుకగా బారసాల (వీడియో వైరల్)

puppys
తాము ముద్దుగా పెంచుకుంటున్నకుక్కకు నాలుగు పిల్లలు జన్మించడంతో దాని యజమానులు ఘనంగా బారసాల చేశారు. కుక్కపిల్లలకు కొత్త దుస్తులు తొడిగి, ఊయలలో వేసి ఊపారు. ఎక్కడా తగ్గకుండా పక్కా సంప్రదాయబద్ధంగా కార్యక్రమం నిర్వహించారు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలో ఈ చిత్రం చోటుచేసుకుంది. 
 
పట్టణంలోని సుభాష్ నగర్‌ ప్రాంతంలో నివాసం ఉంటున్న రాపెల్లి వినోద్, లావణ్య దంపతులు సంపత్సరం క్రితం షీడ్జూ జాతికి చెందిన కుక్కను తెచ్చుకుని అల్లారుముద్దుగా పెంచుకున్నారు. ఆ శునకం ఇటీవల నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. దీంతో ఆనందపడిన ఆ దంపతులు వాటికి బారసాల వేడుక నిర్వహించారు. చుట్టుపక్కల వారిని, బంధువులను పిలిచి మరీ కార్యక్రమం నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌‍గా మారింది.