మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 9 నవంబరు 2024 (16:09 IST)

వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త పెద్దిరెడ్డి సుధారాణి అరెస్ట్

Sudharani
Sudharani
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆయన కుటుంబం పైన అసభ్యకరంగా పోస్టులు పెట్టిన వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త పెద్దిరెడ్డి సుధారాణి అరెస్ట్ అయ్యారు. ఇప్పటికే సోషల్ మీడియా యాక్టివిస్టులపై కూటమి సర్కారు కొరడా ఝుళిపించింది. 
 
తాజాగా సుధారాణిని అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారని సుధారాణి వెంకటరెడ్డిని అరెస్ట్ చేశారు. ఆపై కోర్టుకు హాజరు పరిచారు. అయితే న్యాయమూర్తికి పెద్దిరెడ్డి సుధారాణి దంపతులు గాయాలను చూపెట్టారు.

పోలీసులు తమపై హింసకు పాల్పడ్డారని తెలిపారు. 2 రోజుల పాటు చిలకలూరి పేట పోలీస్ స్టేషన్‌లో చిత్ర హింసలకు గురిచేశారని న్యాయమూర్తితో చెప్పారు. ఇంకా వారికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.