గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : గురువారం, 7 నవంబరు 2024 (21:38 IST)

అసెంబ్లీకి రాను, మీడియా ముందు ప్రతిపక్ష నాయకుడిగా ప్రశ్నిస్తా: వైఎస్ జగన్

Jagan
ఏపీ అసెంబ్లీలో (AP assembly sessions) పాలక పక్షం తమను ప్రతిపక్షంగా గుర్తించనందున తను అసెంబ్లీకి వచ్చినా ప్రజా సమస్యలను వినిపించే అవకాశం వుండదు కనుక అసెంబ్లీ సమావేశాలు జరిగే కాలంలో మీడియా ముందు ప్రెస్ మీట్ పెట్టి ఏకరువు పెడతానంటూ ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (YS Jagan mohan Reddy) చెప్పారు. మీడియా సమావేశంలో జగన్ మాట్లాడుతూ... అసెంబ్లీలో వుండేటివి రెండే రెండు పక్షాలు. ఒకటి పాలక పక్షం. మరొకటి ప్రతిపక్షం.
 
పాలక పక్షం ప్రజా సమస్యలను పరిష్కరించనప్పుడు వారిని నిలదీసేది ప్రతిపక్షం. మరి ఇప్పుడు అసెంబ్లీలో ప్రతిపక్షం లేదు అని వాళ్లు అంటున్నారు. మాకు సీట్లు తక్కువ వచ్చాయని ప్రతిపక్షం లేదని అంటే ఎలా. ప్రజా సమస్యలపై పోరాడేందుకు ప్రతిపక్షం వుంటుంది కదా. మమ్మల్ని ప్రతిపక్షంలా గుర్తించడం లేదు కనుక ఆ సమయంలో నేను మీడియా ముందు ప్రశ్నలను అడుగుతానంటూ చెప్పారు.
 
సోషల్ మీడియాలో ఆ పోస్టులు చూసి నా పిల్లలు ఏడ్చారు: పవన్
వైసీపీ అనుబంధ ఖాతాల ద్వారా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఆయన కుమార్తెలపై అనేక అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు. ట్రోలింగ్‌తో తన కుమార్తెలు కన్నీళ్లు పెట్టుకున్నారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ చేస్తున్న ట్రోలింగ్, బూటకపు ప్రచారంపై ప్రభుత్వం కూడా ఆగ్రహం వ్యక్తం చేసి, సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోనుందన్నారు.
 
ఆంధ్రప్రదేశ్‌లో గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఘటనలపై ఇటీవల జనసేనాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై హోం మంత్రి అనిత కూడా సానుకూలంగా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత.. రాష్ట్ర సచివాలయంలో భేటీ కావడం తీవ్ర ప్రాధాన్యం సంతరించుకుంది.
 
రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో మర్యాదపూర్వకంగా సమావేశం కావడం జరిగిందని హోం మంత్రి అనిత ఎక్స్‌లో పోస్ట్ చేశారు. రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు.. వాటిపై హోంశాఖ తీసుకుంటున్న చర్యలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని చెప్పారు.
 
ఆంధ్రప్రదేశ్‌లో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాలు, ఇతర అఘాయిత్యాల విషయంలో ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో ఆడబిడ్డలకు అన్యాయం చేసిన వారిని చట్టప్రకారం కఠినంగా శిక్షించేలా గట్టి చర్యలు తీసుకోవాలని పేర్కొన్నట్లు వెల్లడించారు. ఇక పవన్ తన కుమార్తెలు ట్రోలింగ్‌పై ఆవేదనకు గురైన విషయాన్ని వెల్లడించడంపై ఆయన ఫ్యాన్స్ సీరియస్ అయ్యారు. ట్రోలర్లపై ఫైర్ అవుతున్నారు.