గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 16 అక్టోబరు 2024 (19:32 IST)

ఫాంహౌస్‌లో వృద్ధ దంపతులు హత్య.. ఎందుకు?

murder
రంగారెడ్డిలోని ఓ ఫాంహౌస్‌లో వృద్ధ దంపతులు హత్యకు గురైనారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం కొత్తగూడ గ్రామంలో మంగళవారం రాత్రి ఫాంహౌస్‌లో కేర్‌టేకర్‌గా పనిచేస్తున్న వృద్ధ దంపతులు హత్యకు గురయ్యారు. వీరికి ఆ ఫాంహౌస్ భద్రత, నిర్వహణ బాధ్యతలను అప్పగించారు.
 
అయితే మంగళవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు దంపతులపై దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న కందుకూరు పోలీసులు దోపిడీ ప్రయత్నాల్లో భాగంగానే వృద్ధ దంపతుల హత్య జరిగిందా? లేక దంపతులకు తెలిసిన వారిని హత్య చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. విచారణ వివిధ కోణాల్లో జరుగుతోంది.