హైదరాబాదులో సైబర్ మోసగాళ్లు.. రూ.10.61 కోట్లు కోల్పోయిన వృద్ధ జంట
సైబర్ మోసగాళ్లు హైదరాబాద్‌లో ఎక్కువైపోతున్నారు. నగరానికి చెందిన ఓ వృద్ధ జంటను రూ.10.61 కోట్ల మేర మోసం చేశారు. వివరాల్లోకి వెళితే.. మోసగాళ్లు వృద్ధుడిని వాట్సాప్ ద్వారా సంప్రదించారని, అతని పేరు మీద ముంబైలో బ్యాంక్ ఖాతా తెరిచినట్లు చెప్పారు.
ఇక, జూలై 8న మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని పేర్కొంటూ, నకిలీ మెసేజ్ లు పంపడంతో పాటు ఆ జంటను భయపెట్టే వ్యూహాలను ఉపయోగించారు. ఇక ఆ మనీలాండరింగ్ కేసు నుండి అతని పేరును క్లియర్ చేయడానికి వారి ఆదేశాలను అనుసరించమని స్కామర్లు బాధితుడికి సూచించారు.
ఇక భయంతో వణికిపోయిన ఆ జంట స్కామర్ల వలలో చిక్కుకున్నారు. నేరంతో సంబంధం లేదని తేలితే మూడు రోజుల్లో నిధులు తిరిగి వస్తాయని పేర్కొంటూ మోసగాళ్ల ఖాతాలకు బదిలీ చేయమని వారు ఒప్పించారు.
ఈ క్రమంలో ఆ వృద్ధ జంటను జులై 8 నుంచి 26వ తేదీ వరకు 11 వాయిదాల్లో మొత్తం రూ.10.61 కోట్లను మోసం చేశారు. ఆపై మోసపోయామని తెలుసుకున్న ఆ జంట సైబర్ పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.