1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. 'E-Watch' is a mobile app for holding elections impartially

ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేందుకు 'ఈ-వాచ్' మొబైల్‌యాప్‌

E-Watch
'ఈ-వాచ్' పేరుతో మొబైల్‌యాప్‌తో పాటు కాల్‌ సెంటర్‌ను బుధవారం ఉదయం 11 గంటలకు ఎస్‌ఇసి నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ప్రారంభించనున్నారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేందుకు ఈ యాప్‌ను తీసుకువస్తున్నటు తెలుస్తోంది.

ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇందులో గ్రామ పంచాయతీ ఎన్నికలు, ఎన్నికలకు సంబంధం ఉండే ఏ ఇతర సమస్యలు మీదనైనా ఫిర్యాదులు చేసేవారు ఈ కాల్‌ సెంటర్‌ను సంప్రదించవచ్చునని, యాప్‌ను కూడా సద్వినియోగపరుచుకోవచ్చని ఎస్‌ఇసి కార్యాలయం తెలిపింది.
 
అయితే ఈ యాప్‌ ఇప్పుడు వివాదాస్పదమౌతోంది. ఈ యాప్‌ తీసుకురావడంపై అధికార వైసిపి నేతలు మండిపడుతున్నారు. ఇది రమేష్‌ కుమార్‌ ఏర్పాటు చేసుకున్న ప్రైవేటు యాప్‌ అని, తమకు తెలియకుండా దీన్ని రూపొందించారని విమర్శిస్తున్నారు. 
About Writer
ఎం
తర్వాతి కథనం
12న దేశవ్యాప్త నిరసనలు .. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా వ్యతిరేక బడ్జెట్‌కు వ్యతిరేకంగా!