1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Electricity to touch the child

చిన్నారిని ముట్టుకుంటే విద్యుత్

Electricity
ముద్దులొలికే ఆ చిన్నారిని ముట్టుకుంటే విద్యుత్ ప్రవహిస్తోంది. ఆ విషయం అమ్మానాన్నకి తెలిసి వెంటనే డాక్టర్ దగ్గరకు పరిగెట్టారు. పాపాయి ఒంట్లో నిజంగానే విద్యుత్ ప్రవహిస్తుందని చెప్పేసరికి వారికి కరెంట్ షాక్ కొట్టినంత పనైంది.

పశ్చిమ గోదావరి జిల్లా దామచర్ల గ్రామానికి చెందిన ఏలూరి హరిబాబు, సుస్మిత దంపతులకు ఆరు నెలల క్రితం పాప జన్మించింది. ఓ రోజు పాప ఆడుకుంటూ అక్కడే కింద ఉన్న ఎల్‌ఈడీ బల్బ్‌కి తగిలింది. దాంతో లైటు వెలిగింది. అది చూసి పాప తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు.

విషయం తెలిసి చుట్టు పక్కల గ్రామ ప్రజలు వచ్చి పాపను చూస్తున్నారు. అవేమీ తెలియని ఆ చిన్నారి బోసి నవ్వులతో ఆనందాన్ని పంచుతోంది. పాప ఒంట్లో అలా విద్యుత్ ప్రవహించడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

పాపకు మరే విధమైన అనారోగ్య సమస్యలు లేకపోవడంతో ఎదిగే క్రమంలో ఏమైనా తగ్గుతుందేమోనని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
About Writer
ఎం
తర్వాతి కథనం
పాపమని పాత చీర ఇస్తే ..సీఎం జగన్‌కు లింగమనేని లేఖ