జనగామ ఆరోగ్యకేంద్ర రికార్డు.. ఒకే రోజు 16 సుఖప్రసవాలు
నవమాసాలు నిండాయంటే చాలు.. కాన్పు ఎప్పుడవుతుందా అని ఎదురుచూస్తుంటారు. పురిటి నొప్పులు మొదలయ్యాయంటే.. నొప్పులు తట్టుకోలేని వారి బాధను చూడలేని కుటుంబ సభ్యులు ఆపరేషన్ వైపు మొగ్గు చూపుతున్నారు.
ఇకపై అలాంటి అవసరం ఉండదని, తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప... సిజేరియన్ అవసరంలేదని చెబుతున్నారు వైద్యులు. సుఖ ప్రసవాలతోనే మహిళల ఆరోగ్యానికి రక్ష అని చెప్పడమే గాక చేసి చూపిస్తున్నారు. తొమ్మిది నెలలు నిండాయంటే ఎప్పుడెప్పుడు కాన్పవుతుందా అని మహిళలు ఎదురుచూస్తుంటారు.
సాధారణ ప్రసవం అంటే నొప్పికి భయపడి సిజేరియన్ను ఆశ్రయిస్తున్నవారు ఎంతో మంది. కానీ వీటి వల్ల ప్రసవం అనంతరం వచ్చే ఆరోగ్య సమస్యలపై వారు దృష్టి సారించడం లేదు.
ఈ సమస్యకు ఓ పరిష్కారం చూపుతున్నారు జనగామ జిల్లా వైద్యులు. సాధారణ ప్రసవాలపై అవగాహన కల్పిస్తూ మహిళలు సాధారణ ప్రసవాల వైపే మొగ్గుచూపేందుకు కృషి చేస్తున్నారు.