సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : మంగళవారం, 24 సెప్టెంబరు 2019 (05:18 IST)

ఆ 'పెదరాయుడి'తో ఊరికి తలనొప్పి

అతడా ఊరికి పెదరాయుడు. అయితే చాలా తేడా. ఆయన చెప్పిందే వేదం.. చేసిందే శాసనం. నచ్చకపోతే పంచాయితీ పెట్టించి గుండు కొట్టిస్తాడు. ఇష్టం లేకపోతే ముక్కు నేలకు రాయిస్తాడు. ఎదురు తిరిగితే ఎంతకైనా వెనుకాడడు.

తాగుబోతు భర్తలను చెప్పుచేతల్లో పెట్టుకొని భార్యలను వేధిస్తాడు. ఇతడి ధనబలానికి, అంగబలానికి ఎదురుచెప్పే సాహసం కూడా ఎవరూ చేయరు. ఆ పెదరాయుడి పేరు బాబు. ఊరు ఖమ్మం జిల్లా గంధసిరి.

ఈ ఊరికి అతడే పోలీస్‌ స్టేషన్. అతడే కోర్టు. 'కొబ్బరిమట్ట' సినిమాలో సంపూర్ణేష్ బాబు రేంజ్‌లో ఉంటాయి అతడి తీర్పులు. తీర్పుల పేరుతో గుండ్లు కొట్టించడం, ముక్కు నేలకు రాయించడం, ఫోన్లోనే పంచాయితీలు పెట్టి.. తీర్పులు చెప్పేయడం. మందుబాటిళ్లు ముందుపెట్టుకొని సెటిల్‌మెంట్లు చేయడం.

ఇలా పెద్ద మనిషి ముసుగులో బాబు చేస్తున్న అరాచకాలకు హద్దే లేదు. ఇతడి ఆగడాలను తట్టుకోలేక జనం ఏకంగా గంధసిరి గ్రామాన్నే వదిలిపోతున్నారు. కొంత మంది ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎలాంటి ఫలితం ఉండటం లేదు.