శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 17 ఆగస్టు 2019 (08:35 IST)

మైనర్ బాలికపై గ్రామ పెద్దల దాడి.. ప్రేమించిన పాపానికి కాలిదెబ్బలు

కంప్యూటర్ యుగంలోనూ పాతకాలపు మూఢనమ్మకాలు ఏ మాత్రం తగ్గడంలేదు. చేతబడి, బాణామతి, కులాచారం, గ్రామ కట్లుబాట్లు అంటూ నేటి కాలపు మనుషులు కూడా మతి తప్పినట్లు ప్రవర్తిస్తున్నారు.  ఇలాంటి మూఢనమ్మకాలను గుడ్డిగా నమ్ముతూ మైనర్ బాలికను గొడ్డును బాదినట్లు బాదారు గ్రామ పెద్దలు. 
 
ప్రేమించుకున్న పాపానికి ఇద్దరు దళిత మైనర్లను  పంచాయతీకి  పిలిపించి కర్ర దెబ్బలు,  కాలిదెబ్బలతో  బహిరంగ శిక్ష వేశారు. గ్రామం మొత్తం చూస్తుండగా ఇద్దరు మైనర్లను విశాక్షణారహితంగా కొట్టారు. యావత్తు మానవజాతి తలదించుకునేలా ఉన్న ఈ ఘటన అనంతపురం జిల్లాగుమ్మగట్ట మండలం కెపి దొడ్డి గ్రామంలో జరిగింది. 
 
కొంతమంది గ్రామస్తులు పంచాయతీ పెద్దలు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకో పోలీసులు కూడా ఈ ఘటనపై మౌనం వహించారు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ దారుణ ఘటన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారడంతో పోలీసులు విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది.