మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 17 ఆగస్టు 2019 (08:30 IST)

పరిశ్రమలు పెట్టాలనుకుంటే ఒకే ఒక్క దరఖాస్తు చాలు.. జగన్

పరిశ్రమలకు పెట్టాలనుకునేవారికి తమ ప్రభుత్వంలో అడ్డంకులు ఉండబోవని ముఖ్యమంత్రి  వైయస్ జగన్ స్పష్టంచేశారు. తమ రాష్ట్రంలో ఎవరైనా పరిశ్రమలు పెట్టాలనుకుంటే కేవలం ఒకే ఒక్క దరఖాస్తు నింపితే సరిపోతుందని, తన కార్యాలయమే దగ్గరుండి అన్ని పనులూ చేస్తుందని ఆయన పునరుద్ఘాటించారు.

ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ అండ్ మానిటరింగ్ అథారిటీ (ఇప్మా) పారిశ్రామిక వేత్తలకు, పెట్టుబడిదారులకు చేదోడువాదోడుగా ఉంటుందని సీఎం అన్నారు. వారికి చేయూతనిచ్చి నడిపించడమే కాదు, పరిశ్రమలకు అవసరమైన భూములు, కరెంటు, నీరు సమకూర్చిపెడుతుందని వివరించారు. 
 
అమెరికా రాజధాని వాషింగ్టన్డీసీలో యూఎస్ ఛాంబర్ఆఫ్ కామర్స్ కీలక సమావేశానికి సీఎం హాజరయ్యారు. అక్కడ భారత రాయబారి హర్షవర్ధన్ ష్రింగ్లాతో సీఎం సమావేశమై ముఖాముఖి చర్చలు జరిపారు. యూస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ రౌండ్టేబుల్ సమావేశంలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విశాల సముద్ర తీరం ఉందని, కొత్తగా పోర్టులు నిర్మిస్తున్నామని, వీటిలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. డీశాలినేషన్, మెట్రోరైళ్లు, బకింగ్హాం కాల్వ పునరుద్ధరణ, ఎలక్ట్రికల్ బస్సులు, వ్యవసాయ స్థిరీకరణ, నదుల అనుసంధానం, వ్యవసాయ రంగంలో పరిశోధనలు, వ్యవసాయ ఉప్పత్తులకు మార్కెటింగ్ విస్తరణ, ఆక్వా ఉత్పత్తులకు మార్కెట్ విస్తృతిలో అపార అవకాశాలున్నాయని చెప్పుకొచ్చారు.

నాణ్యత, అధిగ దిగబడులు సాధించడానికి తామ చేసే ప్రయత్నాల్లో భాగస్వాములు కావాలని సీఎం విజ్ఞప్తిచేశారు. తాము ప్రాధాన్యతలుగా చెప్తున్న రంగాలన్నింటిలో పర్యావరణ హితం ఉంటుందన్నారు. ఏ రాష్ట్రానికైనా కేంద్ర ప్రభుత్వ సహాయం అవసరమేనని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఇరుగుపొరుగు రాష్ట్రాలతో తమకు చక్కటి సంబంధాలున్నాయని చెప్పుకొచ్చారు. 
 
యూఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్లో అంతర్జాతీయ వ్యవహారాల సీనియర్ వైస్ ప్రెశిడెంట్ రాబ్ ష్రోడర్ మొదట ప్రారంభ ఉపన్యాసం చేశారు. ఇటీవల ఎన్నికల్లో వైయస్.జగన్మోహన్రెడ్డి ఘనవిజయాన్ని ప్రస్తావిస్తూ ఆంధ్రప్రదేశ్లో ఏర్పడ్డ బలమైన నాయకత్వం అమెరికా– ఆంధ్రప్రదేశ్ మధ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందన్నారు.

5 ట్రిలియన్ ఎకానమీ చేరుకోవాలన్న భారత్ ఆకాంక్షకు తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని వ్యాఖ్యానించారు. ఆరోగ్యరంగాన్ని గాడిలోపెడుతున్నామని, ప్రతి ప్రభుత్వ ఆస్పత్రిని పెద్ద ఎత్తున అభివృద్ధిచేస్తున్నామని వెల్లడించారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యమున్న మానవవనరులను అందించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని వెల్లడించారు. 
 
తర్వాత రాయబారి హర్షవర్దన్ మాట్లాడుతూ గడచిన ఎన్నికల్లో వైయస్.జగన్ ఘన విజయం సాధించారని, ఇంత మెజార్టీ రావడం చరిత్రాత్మకమని వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ సంస్థలు, వ్యాపారవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ సరైన రాష్ట్రమని హర్షవర్దన్ పేర్కొన్నారు. 
 
అంతకుముందు ముఖ్యమంత్రి స్పెషల్ చీఫ్ సెక్రటరీ పీవీ రమేష్ కొన్ని కీలక అంశాలను వివరించారు. విద్యుత్ ఒప్పందాల పునఃసమీక్షతో విద్యుత్ పంపిణీ సంస్థలు నిలదొక్కుకుంటాయని, తద్వారా పరిశ్రమలపై విద్యుత్ ఛార్జీల భారం తగ్గుతుందని వివరించారు.

గోదావరి – కృష్ణా నదుల అనుసంధానం, కడపలో స్టీల్ప్లాంట్, కోస్తాతీరంలో రిఫైనరీ ప్రాజెక్టు, బకింగ్హాం కెనాల్ పునరుద్ధరణ తదితర కీలక ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యాలుగా చేసుకుందని పి.వి.రమేష్ వివరించారు. తన పాదయాత్రద్వారా గౌరవ మఖ్యమంత్రి 2.2 కోట్ల మంది ప్రజలను స్వయంగా కలుసుకుని, సమగ్ర మానవాభివృద్ధికి అవసరమైన అంశాలను గుర్తించి, వాటిని అమలు చేస్తున్నారని వివరించారు.

దివంగత ముఖ్యమంత్రి ప్రారంభించిన ఆరోగ్యశ్రీని సీఎం మరింత విస్తృతపరిచారని వివరించారు. అవినీతి రహిత, పారదర్శక ప్రభుత్వాన్ని అందించడానికి సీఎం వైయస్.జగన్ అనేక చర్యలు తీసుకున్నారని చెప్పారు. కాంట్రాక్టుల్లో, ప్రభుత్వ కొనుగోళ్లలో అత్యుత్తమ పారదర్శకత విధానాలు ప్రవేశపెట్టారని ప్రతినిధులకు వివరించారు. 
 
వారంరోజుల పర్యటనకోసం ముఖ్యమంత్రి  వైయస్.జగన్మోహన్రెడ్డి వాషింగ్టన్ డీసీ చేరుకున్నారు. అక్కడి కాలమానం ప్రకారం ఉదయం 8:30 గంటల ప్రాంతంలో (భారత కాలమాన ప్రకారం శుక్రవారం సాయంత్రం 6గం.లు) వాషింగ్టన్డీసీలోని డల్ఇస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు.

ఎయిర్పోర్టులో భారత రాయబార కార్యాలయ సీనియర్ అధికారులు అరుణిష్ చావ్లా, నికాంత్ అవహద్ ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. టీటీడీ ఛైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి, ఎమ్మెల్యేలు భూమన కరుణాక ర్ రెడ్డి, చెవిరెడ్డి, తెలుగు సంఘాల ప్రతినిధులు ముఖ్యమంత్రికి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.