బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : ఆదివారం, 11 ఆగస్టు 2019 (15:47 IST)

పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ.. చెన్నైకి 8 టీఎంసీల నీరు

శ్రీశైలం నుంచి 3,93,827 క్యూసెక్కుల నీటిని సాగర్‌ ప్రాజెక్ట్‌కు నీటిని విడుదల చేశారు. నీటి విడుదలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంది. శ్రీశైలం కుడి జలవిద్యుత్‌ కేంద్రం ద్వారా 30,774 క్యూసెక్కులు పోతున్నాయి. 
 
ఎడమ జల విద్యుత్‌ కేంద్రం ద్వారా 42,378 క్యూసెక్కులు, క్రస్ట్‌గేట్స్‌ ద్వారా 3,20,655 క్యూసెక్కుల నీరు విడుదలకాగా.. మొత్తంగా 3,93,807 క్యూసెక్కుల నీరు నాగార్జున సాగర్‌ ప్రాజెక్ట్‌కు వచ్చి చేరుతుంది. 
 
ప్రస్తుత నాగార్జున సాగర్‌ జలాశయ నీటిమట్టం 525.30 అడుగులు చేరింది. ప్రస్తుత నీటి నిల్వ 159.11 టీఎంసిలు వున్నాయి. అలాగే చెన్నైకి 8టీఎమ్‌సీల నీటిని విడుదల చేశారు.