సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 11 ఆగస్టు 2019 (12:18 IST)

భర్త లేని సమయంలో మహిళపై ఇంటి యజమాని లైంగికదాడి..

తన ఇంట్లో అద్దెకు ఉంటున్న ఓ మహిళపై ఆ ఇంటి యజమాని కన్నేశాడు. ఆమెతో లైంగికవాంఛ తీర్చుకోవాలని ప్లాన్ వేశాడు. ఇందుకోసం ఆయన చేయని ప్రయత్నమంటూ లేదు. ఏం చేసినా ఆ మహిళ మాత్రం ఇంటి యజమాని బుట్టలో పడలేదు. దీంతో ఆమె భర్త ఇంట్లో లేని సమయంలో ఆమెపై ఇంటి యజమాని లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, అల్వాల్, సిటిజన్స్‌ కాలనీకి చెందిన ఎం.రాములు అనే వ్యక్తి వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఇతనికి కుత్బుల్లాపూర్ సర్కిల్, సుచిత్ర సమీపంలో ఇల్లు ఉంది. ఇతని ఇంటి టెర్రస్ గదిలో ఓ ఆటో డ్రైవర్ కుటుంబం నివాసముంటుంది. 
 
శుక్రవారం సాయంత్రం రాములు ఇంటి కిరాయి కోసం వచ్చి ఒంటరిగా ఉన్న ఆటో డ్రైవర్ భార్య(28)ను పట్టుకుని లైంగిక దాడికి యత్నించాడు. ఆమె కేకలు వేయడంతో స్థానికులు రాములుకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు శనివారం నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.