గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : మంగళవారం, 6 ఆగస్టు 2019 (17:36 IST)

రేణూ దేశాయ్ మకాం మార్చేసింది.. హైదరాబాద్ వచ్చేస్తోంది.. (video)

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ హైదరాబాద్ వచ్చేస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రేణూ దేశాయ్ హైదరాబాదుకు మకాం మార్చేస్తున్నట్లు తెలిపింది రేణూ దేశాయ్.


పవన్ నుంచి విడిపోయిన తర్వాత ఆయనకు దూరంగా పూణేలో వుండిపోయిన రేణూ దేశాయ్.. ప్రస్తుతం సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు గాను హైదరాబాదులో సెటిల్ అవ్వాలని చూస్తోంది. ఈ విషయాన్ని స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలను ప్రస్తావించింది రేణూ దేశాయ్. 
 
త్వరలోనే తాను రైతుల సమస్యలతో సినిమా చేయబోతున్నానని.. నిర్మాతలతో చర్చల కారణంగా తాను హైదరాబాద్‌లో ఉండాల్సిన పరిస్థితులు వచ్చాయంటుంది ఈమె. తరుచూ పని మీద పూణే టూ హైదరాబాద్ ఇబ్బందిగా ఉందని చెప్పిన రేణు.. హైదరాబాద్ మకాం మార్చేయడానికి నిర్ణయించుకున్నట్లు తెలిపింది.
 
ఇకపోతే.. పవన్ నుంచి విడిపోయాక మానసికంగా, ఆరోగ్యపరంగా కుంగిపోయిన రేణూ దేశాయ్.. ఇప్పుడిప్పుడే తనను తాను కొత్తగా ఆవిష్కరించుకునే పనిలో పడింది. దర్శకురాలిగానే కాకుండా నటిగానూ నిరూపించుకోడానికి సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెడుతుంది రేణు దేశాయ్. 
 
ఇక ఇన్ని రోజులు పూణేలో వున్న ఈ భామ.. అక్కడ్నుంచి ఇక్కడకు వస్తూ వెళ్తుంది. తన పని ఉన్నా కూడా పూణే నుంచి రోజూ వచ్చి వెళ్తుండటం.. పిల్లలను బాగా మిస్ అవుతుండటంతో హైదరాబాదులో సెటిలైపోవాలని డిసైడ్ అయ్యింది. ఇంకేముంది.. త్వరలో పూణే బేస్డ్ బిజినెస్‌మేన్‌ను రేణూ దేశాయ్ పెళ్ళాడనుందని టాక్ వస్తోంది.