సంబంధిత వార్తలు
- తమ్ముడికి అన్న స్ట్రాంగ్ క్లాస్.. ఎందుకు?
- ఓడిపోయిన చోట నుంచే పవన్ పర్యటనకు శ్రీకారం... తొలిసారి భీమవరంకు...
- ఫీచర్ కంట్రిబ్యూటర్లకు జనసేన ఆహ్వానం...
- ఆ కోటరీకి డబ్బే ముఖ్యం... జనసేన వార్డు మెంబర్ స్థానాన్ని గెలుచుకోలేదు : పసుపులేటి
- పదవి కోసమే జగన్ రోడ్డెక్కారు... నేనలా వస్తే నా అభిమానులు నన్నలా చేస్తారు... పవన్ కల్యాణ్
పవర్ స్టార్‌తో శర్వానంద్ సెల్ఫీ... ఇంతకీ ఎప్పుడు తీసుకున్నాడు..? (video)
ఒకరేమో టాలీవుడ్ పవర్ స్టార్, మరొకరేమో యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న క్రేజీ హీరో. ఇక ఈ ఇద్దరు కలిస్తే ఇక వారిద్దరి ఫ్యాన్స్‌కు ఎంతో సంబరం అనే చెప్పాలి. అయితే వారిద్దరూ మరెవరో కాదండి, ఒకరు పవన్ కళ్యాణ్ గారైతే మరొకరు శర్వానంద్.
నిజానికి వారిద్దరూ కలిసి ఇప్పటివరకు ఒక్క సినిమాలో కూడా నటించినప్పటికీ, నేడు శర్వానంద్, పవన్ కళ్యాణ్ గారిని హైదరాబాద్‌లోని ఎయిర్ పోర్ట్‌లో అనుకోకుండా కలవడంతో, ఆ వండర్‌ఫుల్ మూమెంట్‌ని తన ఫోన్లో సెల్ఫీ ద్వారా బంధించి, దానిని తన ఫ్యాన్స్ కోసం షేర్ చేసారు.
ఇక ఈ ఫోటోను చూసిన పలువురు పవన్ ఫ్యాన్స్ మరియు శర్వా ఫ్యాన్స్, భవిష్యత్తులో కుదిరితే వారిద్దరూ కలిసి ఒక సినిమాలో నటించాలని కోరుకుంటూ ఆనందంతో తమ సోషల్ మీడియా ఖాతాల్లో ఆ ఫోటోను షేర్ చేస్తూ సంతోషపడుతున్నారు.
