గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Modified: బుధవారం, 7 ఆగస్టు 2019 (00:03 IST)

'తెలంగాణ చిన్నమ్మ' సుష్మా స్వరాజ్ అస్తమయం... శోక సంద్రంలో భారతావని...

భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకురాలు సుష్మా స్వరాజ్ కన్నుమూశారు. మంగళవారం రాత్రి ఆమె గుండెపోటుతో స్వగృహంలోనే కుప్పకూలారు. ఆమెకు గుండెపోటు రావడంతో వెనువెంటనే ఎయిమ్స్ కి తరలించారు. కానీ అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. ఆమె వయసు 67 సంవత్సరాలు.
 
సుష్మా హఠన్మరణంతో భాజపా శ్రేణులు దిగ్భ్రాంతికి గురయ్యాయి. ఆమె మరణవార్త తెలిసిన వెంటనే హోంమంత్రి అమిత్ షా ఇతర మంత్రులు ఎయిమ్స్ ఆస్పత్రికి వెళ్లారు. గత కొంతకాలంగా సుష్మా కిడ్నా సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. ఇటీవలే కొందరు మంత్రులు ఆమెను పరామర్శించి వచ్చారు.