బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 11 ఆగస్టు 2019 (12:06 IST)

ఇక కాంగ్రెస్‌కు పూర్వవైభవం : ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీకి తిరిగి పూర్వవైభవం రానుందని తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఎంపీ, టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి జోస్యం చెప్పారు. ఏఐసీసీ అధ్యక్షురాలిగా మళ్లీ సోనియా గాంధీని నియమించడంపై ఆయన స్పందించారు. 
 
తెలుగు రాష్ట్రాల ప్రజల గుండెల్లో తనకంటూ ప్రత్యేక స్థానం ఉన్న సోనియా గాంధీ ఏఐసీసీ అధ్యక్షురాలిగా పునరాగమనంతో పార్టీకి పూర్వ వైభవం ఖాయమన్నారు. దేశరాజధాని ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశంలో పార్టీ అధ్యక్షురాలిగా తిరిగి సోనియానే నియమిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. 
 
దీనిపై దేశవ్యాప్తంగా పార్టీ శ్రేణుల నుంచి హర్షం వ్యక్తమవుతుండగా ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి కూడా గొంతుకలిపారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సోనియా నియామకం ఎంతో సరైన నిర్ణయమని వ్యాఖ్యానించారు. తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ పార్టీకి పూర్వవైభవం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏఐసీసీ అధ్యక్షురలిగా నియమితులైన సోనియాకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.