మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : గురువారం, 11 ఏప్రియల్ 2019 (15:37 IST)

వాజ్‌పేయి కంటే నరేంద్ర మోడీ గొప్పవాడా : సోనియా గాంధీ

కాంగ్రెస్ మాజీ అధినేత్రి, యూపీఏ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ రాయ్ బరేలీ నియోజకవర్గంలో గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా భారీ రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంకా గాంధీలు కూడా పాల్గొన్నారు. కాగా, నామినేషన్‌కు ముందు సోనియా తన కుటుంబ సభ్యులతో కలిసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. 
 
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోడీ ఓటమి ఎరుగని నేతగా తాము భావించడంలేదన్నారు. 2004 ఎన్నికల సందర్భంగా వాజ్‌పేయి గురించి కూడా ఇలాగే అనుకున్నారని, కానీ, తాము ఆ ఎన్నికల్లో ఘనవిజయం సాధించామని గుర్తుచేశారు. ఇప్పుడు మోడీ అంతకంటే గొప్పవాడేమీ కాదని, ఈ ఎన్నికల్లో తమదే విజయం అని ధీమా వ్యక్తం చేశారు. 
 
ఆ తర్వాత రాహుల్ స్పందిస్తూ, తమకు తిరుగులేదని, ప్రజల కంటే తామే గొప్పవాళ్లమని అహకరించిన వాళ్లు భారతదేశ చరిత్రలో కొందరు ఉన్నారని, నరేంద్ర మోడీ గత ఐదేళ్లలో ప్రజలకు చేసిందేమీ లేదని అన్నారు. ఆయన ఎంతటి అజేయుడో ఎన్నికల తర్వాత తేలిపోతుందని రాహుల్ అన్నారు.