అజిత్ సినిమా టిక్కెట్ దొరకలేదనీ అభిమాని ఆత్మహత్యాయత్నం

Last Updated: శుక్రవారం, 9 ఆగస్టు 2019 (11:29 IST)
తమిళ హీరో అజిత్ నటించిన తాజా చిత్రం 'నెక్కొండ పార్వై'. బాలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన పింక్ చిత్రానికి రీమేక్. అజిత్ ప్రధాన పాత్రలో నటించాడు. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అజిత్ కొత్త చిత్రం వస్తుందంటే అభిమానులకు ఓ పండగే.

అలాగే, నెక్కొండ పార్వై చిత్రానికి కూడా ఎంతో క్రేజ్ లభించింది. ఈ చిత్ర తొలిరోజు టికెట్ తనకు దక్కలేదన్న మనస్తాపంతో ఓ వీరాభిమాని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

రాష్ట్ర రాజధాని చెన్నై మహానగరం, రాయపేటలోని సత్యం సినీ మల్టీప్లెక్స్ వద్ద ఈ ఘటన జరుగగా, ఆ సమయంలో అక్కడే ఉన్ననటుడు శంతను భాగ్యరాజ్, తన ట్విట్టర్ ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడించాడు.

రాత్రి, 11.55 గంటల సమయంలో ఈ ఘటన జరిగిందని చెప్పాడు. టికెట్ దొరకలేదన్న కారణంగా పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేశాడని అన్నారు. అక్కడే ఉన్న పోలీసులు, అతన్ని అరెస్టు చేసి తరలించారని, అభిమానులు ఈ తరహా చర్యలకు పాల్పడవద్దని శంతను పిలుపునిచ్చాడు.దీనిపై మరింత చదవండి :