నటి ప్రిన్సీతో వివాహేతర సంబంధం... భార్యకు నరకం చూపిన ముధుప్రకాష్
హైదరాబాద్ నగరంలో బుల్లితెర, బాహుబలి నటుడు మధుప్రకాష్ భార్య భారతి ఆత్మహత్య కేసును పోలీసులు సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ దర్యాప్తులో భాగంగా, మధుప్రకాష్‌కు నటి ప్రిన్సీతో అక్రమ సంబంధం ఉన్నట్టు తేల్చారు. ఈ సంబంధం కారణంగానే భార్యను మధుప్రకాష్ నిరంతరం వేధిస్తూ వచ్చాడని, ఈ వేధింపులు భరించలేక ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.
గుంటూరుకు చెందిన లక్ష్మణ్, తిరుమల అనే దంపతలకు చెందిన పెద్ద కుమార్తె భారతి (34) అనే యువతి బీటెక్ పూర్తి చేసిన లండన్‌లో ఎంబీఏ పూర్తి చేసింది. ఆపై ఆమెకు అక్కడే ఉద్యోగం రావడంతో మూడేళ్ళపాటు లండన్‌లోనే ఉన్నది. ఈ క్రమంలో టీవీ నటుడు మధుప్రకాష్ ఫేస్‌బుక్‌లో పరిచయమయ్యాడు. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆ తర్వాత పెద్దల అనుమతితో పెళ్లి చేసుకున్నారు. వీరిది ప్రేమ వివాహం అయినప్పటికీ వివాహ సమయంలో భారీగానే కట్నకానులు ఇచ్చినట్టు భారతి తల్లిదండ్రులు చెబుతున్నారు.
ఈ క్రమంలో గత యేడాది కాలంగో మరో టీవీ సీరియల్ నటి ప్రిన్సీతో పరిచయం పెంచుకున్న మధు భార్యను తరచూ వేధించడమేగాక సదరు యువతితో భార్యను తిట్టించేవాడు. ఓ సారి ఆమె ఇంటికి తీసుకు రావడంతో భారతి ప్రశ్నించగా ఆమె భారతిని కొట్టిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మంగళవారం ఉదయం జిమ్‌కు వెళ్లిన మధు.. తిరిగి ఇంటికి రాకుండా ప్రిన్సీ ఇంటికి వెళ్లాడు.
మధ్యాహ్నం భర్తకు వీడియో కాల్ చేసిన భారతి తాను చనిపోతున్నాని ఫ్యాన్‌కు వేలాడుతున్న చున్నీని చూపించినా అతను పట్టించుకోలేదు. రాత్రి 7.30 గంటలకు ఇంటికి వచ్చిన మధు ప్రకాష్ తలుపు కొట్టగా స్పందించకపోవడంతో మాస్టర్ కీతో తలుపులు తెరచి చూడగా ఫ్యాన్‌కు ఉరివేసుకొని కనిపించింది. కిందికి దించి చూడగా అప్పటికే మృతి చెందింది. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
టీవీ సీరియల్ నటి ప్రిన్సీతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ మధు ప్రకాష్ నరకం చూపించడంతో భరించలేక తన కుమార్తె భారతి ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె తల్లి తిరుమల ఆరోపిస్తున్నారు. యేడాదిగా వారి మధ్య గొడవలు జరుగుతున్నాయని, కుమారుడికి బుద్ధి చెప్పాల్సిన తల్లిదండ్రులు కోడలిని వేధించారని ఆమె ఆరోపించారు. విడాకుల కోసం ఒత్తిడి తేవడంతో మనస్తాపానికిలోనై ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందన్నారు.