శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 23 సెప్టెంబరు 2019 (06:28 IST)

భార్యాపిల్లల్నిహత్య చేసీ... విశాఖలో ఘోరం

కట్టుకున్న భార్యను, ఏడాదిన్నర వయసున్న కూతురిని హత్య చేసి తర్వాత తాను కూడా సూసైడ్ చేసుకున్నాడో వ్యక్తి. విశాఖలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.

ఒడిశాకు చెందిన సుజిత్ బన్స్‌దేవ్.. ఈనెల 19న భార్యాపిల్లల్ని చంపేశాడు. తర్వాత అపార్ట్‌మెంట్ నుంచి వెళ్లిపోయాడు. తల్లికి ఫోన్ చేసి తాను చేసిన ఘోరాన్ని చెప్పి మృతదేహాలను తీసుకెళ్లాలని కోరాడు. తాను కూడా సూసైడ్ చేసుకుంటున్నట్టు చెప్పాడు. తర్వాత రూర్కెలా వెళ్లి అక్కడ రైలు కింద పడి చనిపోయాడు.
 
సుజిత్ బన్స్‌దేవ్ భార్య సుక్ల సమంతతో కలిసి విశాఖలోని బింద్రానగర్‌లో నాలుగేళ్లుగా ఉంటున్నాడు. ఉన్నట్టుండి ఏమైందో కానీ భార్యను, కూతురిని దారుణంగా చంపేశాడు. తన తల్లికి మర్డర్ చేసిన విషయం చెప్పడంతో.. వారు భువనేశ్వర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు.

అక్కడి నుంచి పీఎస్‌ పాలెం పోలీసులకు ఫోన్ చేసి చెప్పారు. దీంతో.. శనివారం సుక్రజిత్ ఇంటికి వెళ్లిన స్థానిక పోలీసులు తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లారు. అక్కడున్న రెండు మృతదేహాల్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు.

భువనేశ్వర్ నుంచి వచ్చిన మృతురాలి తల్లిదండ్రులు సుక్రజిత్ చేసిన ఘోరం చూసి కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.