పాముకాటుకు మరో గృహిణి మృతి

snake bite
ఎం| Last Updated: మంగళవారం, 3 సెప్టెంబరు 2019 (20:35 IST)
నాగాయలంక మండలం పెదపాలెం గ్రామానికి చెందిన బొడ్డు నాగేశ్వరమ్మ (40)
తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో ఇంటివద్ద పాము కరవడంతో మృతి చెందింది

బొడ్డు నాగేశ్వరమ్మ (40)
తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో ఇంటివద్ద పాము కరవడంతో గమనించిన కుటుంబసభ్యులు నాగాయలంక ప్రాధమిక వైద్య కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడి. ఉంది అవనిగడ్డ ఏరియా ఆసుపత్రికి, మరలా అక్కడినుండి మచిలీపట్నం జిల్లా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమద్యమంలో నాగేశ్వరమ్మ మృతి చెందింది.

నాగేశ్వరమ్మ మృతితో అవనిగడ్డ నియోజకవర్గంలో పాముకాటు మృతుల సంఖ్య 10 కి చేరింది. మృతురాలికి ఇద్దరు ఆడపిల్లలు, 2 సంవత్సరాల బాబు ఉన్నారు.

2019 సంవత్సరలో అవనిగడ్డ నియోజకవర్గ వ్యాప్తంగా అవనిగడ్డ మండలంలో ఒకరు, ఘంటసాల మండలంలో ఒకరు, మోపిదేవి మండలంలో ఒకరు, చల్లపల్లి మండలంలో ఇద్దరు, కోడూరు మండలంలో ఇద్దరు, నాగాయలంక మండలంలో ముగ్గురు పాము కాటుకు మృతి చెందారు.
దీనిపై మరింత చదవండి :